వైద్యులతో జయలలిత మాటల ఆడియో

చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సమయంలో వైద్యులతో తమిళనాడు మాజీ సీఎం జయలలిత మాట్లాడిన ఆడియో విడుదలైంది. ఆడియోను అర్ముగస్వామి కమిషన్‌ విడుదల చేసింది. ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతున్నప్పుడు.. మాట్లాడినట్టు ఆడియో, డైట్‌ మెను విడుదల చేశారు. అయితే, కమిషన్‌ విడుదల చేసిన వివరాల్లో అస్పష్టత నెలకొంది. జయలలిత అడ్మిట్‌ అయిన తేదీ సెప్టెంబర్‌ 22, 2016 కాగా, డైట్‌ మెనూలో ఉన్న తేది 2 ఆగస్టు, 2016 అని ఉంది. దీనిపై ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ డైట్‌ మెనూపై అర్ముగస్వామి కమిషన్‌ సీల్‌ కూడా ఉంది.

Related News