నిత్యామీననే అమ్మ.. ‘ద ఐరన్ లేడీ’

గ్లామర్ ఇండస్ర్టీలోనేకాదు, రాజకీయాల్లోనూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు దివంగత మాజీ సీఎం జయలలిత. ఆమె లైఫ్‌స్టోరీపై బయోపిక్‌లను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు డైరెక్టర్లు. వాళ్లలో భారతీరాజా, ప్రియదర్శిని, ఆదిత్య భరద్వాజ్, ఏఎల్ విజయ్‌లు వున్నారు. డైరెక్టర్ ప్రియదర్శని ‘ద ఐరన్ లేడీ’ పేరిట గురువారం ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేసి.. ఫిబ్రవరి 24న జయలలిత పుట్టినరోజు సందర్భంగా షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.

తమిళ, కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో జయలలిత రోల్‌ని వరలక్ష్మిశరత్‌కుమార్ చేస్తుందని తొలుత వార్తలొచ్చాయి. అయితే, ఇప్పుడు ఈ పాత్రని ప్రముఖనటి నిత్యామీనన్ చేయడం కన్ఫామ్ అయింది. దీనికి సంబంధించి  కోలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ రమేష్ బాల ట్వీట్స్ చేశారు. మొత్తానికి తమిళ తంబీలు అమ్మగా కొలిచిన అద్భుతమైన పాత్ర నిత్యాకు దక్కిందన్న మాట.

Related News