జపాన్‌లో ‘కుమారవర్మ’.. వావ్ !

బాహుబలి-2 చిత్రంలో మొదట అమాయకుడు, పిరికివాడిగా కనిపించి ఆ తరువాత ధైర్యంగా శత్రువులను ఎదుర్కొన్న వీరుడి పాత్ర పోషించిన నటుడు సుబ్బరాజుకు జపాన్‌లో సినీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాకు ఆ దేశంలో కలెక్షన్ల వర్షం కురుస్తుండడంతో అక్కడికి వెళ్ళాడు సుబ్బరాజు. కుమారవర్మ వేషధారణలో వెళ్ళిన ఈ నటుడికి ఓ సినీ థియేటర్లో ఆడియెన్స్ అద్భుతంగా స్వాగతం పలికారు. ఆ ఫోటోలను బాహుబలి టీమ్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘జపాన్ వాసులు మా కుమారవర్మపై చూపిన ఆదరాభిమానాలకు కృతఙ్ఞతలు.. సుబ్బరాజు ఆనందాన్ని చూసి ఆశ్చర్యపోయాం’ అని ట్వీట్ చేసింది. ఆ దేశంలోని సినీ థియేటర్లో సుబ్బరాజు తీసుకున్న సెల్ఫీలను కూడా చిత్ర బృందం పోస్ట్ చేయడం విశేషం. ఆ మధ్య ఈ మూవీ దర్శకధీరుడు రాజమౌళిని కూడా జపనీయులు అక్కున చేర్చుకోగా.. ఆ ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి.

 

 

Related News