జపాన్‌ అల్లకల్లోలం.. 200కు చేరిన మృతులు

జపాన్‌లో కురిసిన భారీ వర్షాలకు.. వరదల బీభత్సానికి మృతి చెందిన వారి సంఖ్య 200కు చేరింది. మరో అరవై మంది జాడ తెలియడంలేదు. ఈ మేరకు జపాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. గత వారం రికార్డు స్థాయిలో కురిసిన వర్షాల కారణంగా జపాన్‌ అల్లకల్లోలమైంది.

జన జీవనం స్తంభించింది. కొండ చరియలు విరిగిపడటంతో నివాసాలు, వందల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం 7 వేల మంది పునరావస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు.

రైలు, రవాణా మార్గాలు దెబ్బతినడంతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వరదలతో రహదారులపై పేరుకుపోయిన చెత్త, బురదను తొలగించడానికి దాదాపు పదివేల మంది సహాయక సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు.

 

Related News