కేరాఫ్ విజయవాడ! అద్దె ఇంట్లోకి పవన్ దంపతుల ఎంట్రీ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం విజయవాడలోని పడమటిలంకలో నూతన గృహ ప్రవేశం చేశాడు. అద్దెకు ఓ ఇంటిని తీసుకున్న పవన్ సతీసమేతంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.

ఆ తరువాత గుంటూరు జిల్లా నంబూరులో లింగమనేని టౌన్ షిప్ వద్ద నిర్మించిన దశావతార వెంకటేశ్వరస్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి సంప్రదాయ వస్త్రధారణలో వెళ్లాడు. గురువారం హైదరాబాద్ నుంచి కుటుంబ సమేతంగా పవన్ విజయవాడ చేరుకున్నాడు.

కాగా..రామవరప్పాడు వద్ద ప్రారంభించిన పార్టీ కార్యాలయాన్ని జిల్లా కార్యాలయంగా ఉంచాలని, కొత్తగా రాజధాని ప్రాంతంలో భూమిపూజ చేసిన రాష్ట్ర పార్టీ కార్యాలయ పనులు త్వరగా ప్రారంభించాలన్నది పవన్ యోచనగా చెబుతున్నారు. అలాగే కొత్తగా గృహప్రవేశం చేసిన నివాసంలో ఉంటూ పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ, ముఖ్య నేతలతో సమావేశాల నిర్వహణ బెటరని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Related News