పవన్ మాతో చేతులు కలపవచ్చు

తెలంగాణలో ప్రీ-పోల్ అలయెన్స్‌పై సీపీఎం, జనసేన పార్టీలు ఈ వారంలో చర్చలు జరపనున్నాయి. సుమారు 28 చిన్న పార్టీలతో కూడిన బహుజన లెఫ్ట్‌ఫ్రంట్‌కు నాయకత్వం వహిస్తున్న సీపీఎం .. టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు జనసేనతో చేతులు కలపాలని భావిస్తోంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా తమ భావాలతో ఏకీభవిస్తున్నారనే అనుకుంటున్నామని సీపీఎం తెలంగాణా శాఖ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.

జనసేనతో పొత్తు పెట్టుకోగలమని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్‌లో ఎంసీపీఐ(మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా), మజ్లిస్ బచావో తెహరీక్ (ఎంబీటీ) వంటి పార్టీలు ఉన్నాయి. ఇవన్నీ..కేవలం తెరాసనే కాక, కాంగ్రెస్, బీజేపీలను కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి.

Related News