ఇక్కడంతా రివర్స్.. జంబలకిడి పంబ ట్రైలర్

జ‌య‌మ్ము నిశ్చయ‌మ్మురా మూవీ త‌ర్వాత కమెడియన్ శ్రీనివాస‌రెడ్డి హీరోగా న‌టించిన ఫిల్మ్ ‘జంబ‌ల‌కిడి పంబ‌’. ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్‌ని యూనిట్ రిలీజ్ చేసింది. స్టోరీ అంతా కమెడీ నేపథ్యంలో సాగుతున్నట్లు కనిపిస్తోంది. గతంలో వచ్చిన జంబలకిడి పంబ మాదిరిగానే ఇందులోనూ అంతా రివర్స్. హీరోయిన్ పబ్‌కి వెళ్లడం, డ్రింక్ చేయడం లాంటి సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

రాత్రి ఓ మ్యాటర్ జరిగిందిలే అంటూ హీరోయిన్ సిద్ధి ఇద్నాని వాయిస్‌తో ట్రైలర్ మొదలైంది. దమ్ము ఉండాల్సింది బిర్యానీలో కాదురా.. నీలో అంటూ శ్రీనివాసరెడ్డి మీద చెప్పిన డైలాగ్ బాగుంది. పోసాని కృష్ణముర‌ళి, వెన్నెల కిశోర్ కీల‌కపాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి జె.బి. ముర‌ళీకృష్ణ డైరెక్టర్. ఈనెల 22న మూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.

Related News