ఈ పోస్టర్ కూడా కాపీయే!

బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ మహేష్‌భట్ లేటెస్ట్ ఫిల్మ్ ‘జలేబి’. దీనికి సంబంధించి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేశాడు భట్. ట్రైన్‌లోని ఎమర్జెన్సీ కిటికీ నుంచి ఓ అమ్మాయి.. తన ప్రియుడికి లిప్‌లాక్ ఇచ్చే పోస్టర్. ప్రస్తుతం ఇది సోషల్‌మీడియాలో ట్రెండ్ అవ్వడమేకాదు, యూత్‌ని విపరీతంగా ఎట్రాక్ట్ చేసుకుంటోంది. దసరా సందర్భంగా వచ్చేనెల 12న థియేటర్స్‌కి రానుంది ఈ ఫిల్మ్.

ఇప్పుడు ఈ పోస్టర్ ఆరా తీయడం మొదలుపెట్టారు నెటిజన్స్. 1950లో కొరియా వార్ సందర్భంగా సోల్జర్ రాబర్ట్ మేయి.. తన భార్య గ్లోరియాకి కిస్ ఇచ్చినప్పుడు ‘లాస్‌ ఏంజిల్స్ టైమ్స్’ ఫోటోగ్రాఫర్ ఫ్రాంక్‌బ్రౌన్ క్లిక్ మనిపించింది అది. దాని ఆధారంగా ‘జలేబి’ పోస్టర్‌ని డిజైన్ చేసింది యూనిట్. మరి ఆ ఫోటోకున్న నేపథ్యం ఈ సినిమాలో వుంటుందా అన్నది వెయిట్ అండ్ సీ! భట్ రిలీజ్ చేసిన పోస్టర్‌కి- సినిమాకి అసలు పొంతన వుండదని సినీ ప్రేక్షకులు చెబుతున్నమాట. పబ్లిసిటీ కోసమే ఇదొక ఎత్తుగడ అని అంటున్నారు. అసలు నిజం తెలియాలంటే అక్టోబర్ 12 వరకు వేచి చూడాల్సిందే!

Related News