ఆ బీజేపీ నేత బెదిరిస్తున్నాడు

యూపీలోని ఉన్నవ్‌లో 15 ఏళ్ళ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొని జైలు పాలైన బీజేపీ నేత కుల‌దీప్‌సింగ్ సెంగార్ తమను చంపుతామని బెదిరిస్తున్నాడని బాధిత బాలిక కుటుంబం ఆరోపిస్తోంది. (గత ఏప్రిల్ లో జరిగిన ఆ ఘటనలో బాధితురాలు సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాసం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది). సెంగార్‌ను పోలీసులు అరెస్టు చేయడం, అతనిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేయగా ఆయన జైలు పాలవడం తెలిసిందే. అయితే అధికార పార్టీ నేత అయిన సెంగార్  జైలునుంచే తమను బెదిరిస్తున్నాడని బాధితురాలి బంధువొకరు తెలిపారు. పాలనా యంత్రాంగం కూడా ఆయనను ఏమీ చేయలేకపోతోందని, తమకు రక్షణ ఎక్కడ అని ఆయన వాపోయారు. సెంగార్‌ను వెంటనే బీజేపీ నుంచి బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

Related News