చంచల్‌గూడ జైలుకు జగ్గారెడ్డి తరలింపు

మనుషుల అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 25 వరకు రిమాండ్ విధించడంతో ఆయనను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

తన కుటుంబ సభ్యుల పేర్లతో ముగ్గురిని అక్రమంగా యూఎస్ కు తరలించిన కేసులో ఆయన అరెస్టయ్యారు. అయితే ఉద్దేశపూర్వకంగానే జగ్గారెడ్డిని ఈ కేసులో ఇరికించారని టీ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

READ ALSO

Related News