ఏపీలో ముందస్తు,జనవరిలో!

పార్టీ నేతలను అలర్ట్ చేశారు వైసీపీ అధినేత జగన్. జనవరి చివరిలో ఏపీ శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశముందని, ఇందుకోసం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని నేతలు పిలుపు నిచ్చారు. విశాఖపట్నంలో నిర్వహించిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. జనవరిలో ఎన్నికలు జరిగితే సమర్థంగా ఎదుర్కొనేందుకు బూత్‌ స్థాయిలో ఓటర్లపై నేతలంతా పట్టు సంపాదించాలని నిర్దేశించారు.

వైసీపీ అధికారంలోకి వస్తే అమలు చేస్తామన్న ‘నవరత్నా’ల గురించి ఇంటింటికి ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. వున్నట్లుండి.. జగన్ నోట ముందస్తు ఎన్నికలు అనడం వెనుక అసలు కథ ఏంటని చర్చించుకుంటున్నారు. ప్రజాక్షేత్రంలో నేతలు వుండాలని డైరెక్ట్‌గా చెప్పకుండా ఈ విధంగా ఆయన అలర్ట్ చేసివుంటారా? ఐనా, జగన్ అన్నట్టు ఏపీలో ముందస్తు వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే నవంబర్ లేదా డిసెంబర్లో తెలంగాణలోపాటు ఐదురాష్ర్టాల ఎన్నికలు జరగనున్నాయి. ఆ వెంటనే జనవరిలో ఎన్నికలను ఈసీ సిద్ధమవుతుందా? మేనెలలో సార్వత్రిక ఎన్నికలు వున్నాయి. ఈక్రమంలో  జనవరిలో ఎన్నికలు రావడం కష్టమని రాజకీయ పార్టీల నేతలంటున్నారు. మొత్తానికి జగన్ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే నేతలు తలో విధంగా చర్చించుకోవడం గమనార్హం.

Related News