పవన్ యాత్రను డిసైడ్ చేసిన జగన్.!

ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో ఇటీవలే పోరాటయాత్ర ముగించుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 16 నుంచి కొత్త టర్న్ తీసుకోబోతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల పోరాట యాత్రలో భాగంగా ఆయన మొదటగా పశ్చిమగోదావరిజిల్లాలో పర్యటిస్తారు.

వాస్తవానికి ఉత్తరాంధ్ర పర్యటన అనంతరం పవన్, తూర్పుగోదావరిలో తన పోరాట యాత్ర నిర్వహించాల్సి ఉంది. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌ పాదయాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతున్న నేపథ్యంలో, అదే సమయంలో పవన్‌ కూడా పోరాటయాత్ర చేస్తే శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని పోలీసులు అభ్యంతరం చేయడంతో పవన్ తన రూటు మార్చుకున్నట్టు తెలుస్తోంది.

Related News