‘కేరళ’కు జగన్ కోటి సాయం!

భారీ వరదలతో కూడు, గూడు పోగొట్టుకున్న కేరళవాసులను ఆదుకునేందుకు వివిధ వర్గాల ప్రజలు ముందు కొస్తున్నారు. అనేక రాష్ర్ట ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఇతోధికంగా సాయం చేస్తున్నాయి. కొన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నెలసరి జీతాలను విరాళంగా ప్రకటించారు. ఇదే కోవలో ఏపీ ప్రతిపక్షం, వైసీపీ సైతం స్పందించింది. పార్టీ అధినేత జగన్ ఏకంగా కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఐతే, దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.


జగన్ మీడియాలో మాత్రం ‘కోటి’ విరాళంకు సంబంధించి రెండు పరస్పర విరుద్ధ వార్తలు కనిపించాయి. కేవలం జగన్ అభిమానులు సోషల్ మీడియాలో చూపిన అత్యుత్సాహం మాత్రమేనని, జగన్ ఈ విషయంలో స్పందించలేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

Related News