అంతరిక్షంలో కొత్త కుటుంబం

సువిశాల విశ్వంలో సూర్యుడు, భూమి, ఇతర గ్రహాలు.. ఇలా మనదొక సౌరకుటుంబం. అలాంటిదే మరో పేద్ద సౌరకుంటుంబాన్ని అమెరికాకు చెందిన ఇస్రో ఉపగ్రహం బయటపెట్టింది. భూమికి 800 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ప్రత్యేక నక్షత్ర సమూహాన్ని సదరు ఆస్ట్రోశాట్ గుర్తించింది. అబెల్ 2256గా పిలిచే ఈ అతిపెద్ద నక్షత్రాల గుంపు మూడు వేర్వేరు గెలాక్సీల సమూహంతో ఒకదాని తర్వాత ఒకటిగా కలిసి ఏర్పడినట్టు ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మొత్తం మూడు సమూహాలలో 500 కంటే ఎక్కువ నక్షత్ర మండలాలతో ఏర్పడిన అబెల్ 2256, ప్రస్తుత మన పాలపుంత కంటే 1,500 రెట్లు పెద్దదట. ఈ నక్షత్ర మండల సమూహాల్లోని స్పైరల్ ఆకారంలో ఉన్న గెలాక్సీలు నెమ్మదిగా ద్వికుంభాకార, దీర్ఘవృత్తాకారంలోకి మారుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ స్పైరల్ గెలాక్సీలు పాలపుంత మాదిరిగా నీలి రంగులో ఉన్నాయి. అనేక నక్షత్ర మండల సమూహాలు కలిపి అబెల్ 2256గా రూపవిక్రియ చెందినట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే, మన సౌరకుటుంబాన్ని పోలిన స్థితిగతులు అక్కడ ఉన్నాయా.. లేవా? అన్నది తేలాల్సిఉంది.

Related News