ఇంతకీ జాన్వి స్టోరీ ఏంటి?

దఢక్ ఫిల్మ్ వఛ్చి చాన్నాళ్లు గడుస్తోంది. ఆ చిత్రం రిలీజ్ కి ముందు జాన్వికపూర్ – ఇషాన్ ఖట్టర్ కలిసి ఓ మాగజైన్ కి అదిరిపోయే ఫోటోషూట్ ఇచ్చారు. దానికి సంబంధించి కొన్ని పిక్స్ మాత్రమే బయటకువచ్చాయి. తాజాగా ఓ పిక్ ని ఫాన్స్ తో షేర్ చేశాడు హీరో ఇషాన్. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ పడిపోతున్నాయి.

డెనిమ్ జీన్స్ జాకెట్ లో ఇషాన్ హ్యాండ్సమ్ గా కనిపించాడు. ఇక జాన్వి..బ్లాక్ డ్రెస్ లో మెరిసింది. పిక్ సూపర్ అని కొందరంటే.. ఈ పెయిర్ క్యూట్ గా ఉందని మరికొందరి మాట. ఐనా ఈ ఫోటో వెనుక స్పెషల్ ఏంటి అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఏమైనా స్పెషల్ ఉందా అంటూ చర్చించుకోవడం సినీ లవర్స్ వంతు అయ్యింది. మా మధ్య వర్క్ రిలేషన్ షిప్ మాత్రమేనని ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చాడు ఇషాన్. ప్రస్తుతం తఖ్త్ ఫిల్మ్ తో బిజీగా వుంది జాన్వికపూర్.

Related News