హీరోయిన్ నేహా పెళ్లి వెనుక

బాలీవుడ్ బ్యూటీ నేహాధూపియా గురించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈమె చేస్తున్న టీవీ టాక్ షోలో ఎలాంటి మొహమాటాలు లేకుండా సినీ సెలబ్రిటీల అంతర్గత విషయాలు బయటపెట్టే ఈ అమ్మడు, ఇప్పుడో సీక్రెట్‌ని దాచి పెట్టినట్టు తెలుస్తోంది. ఆ విషయం బయటకు తెలిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయోనని భావించి హడావుడిగా మ్యారేజ్ చేసుకుందంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. కొన్నిరోజుల కిందట టీమిండియా స్పిన్ దిగ్గజం బిషన్‌సింగ్ బేడి కొడుకు అంగద్ బేడీని నేహా రహస్యంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే!

కొన్నాళ్లుగా వీళ్లిద్దరు సహజీవనం చేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్‌కి చెందిన ఓ వెబ్ పోర్టల్ ఓ కొత్త విషయాన్ని రివీల్ చేసింది. నేహా ప్రెగ్నెంట్ అయ్యిందని, అబార్షన్ చేయడం కష్టమని డాక్టర్లు క్లారిటీ ఇవ్వడంతో ఆఘమేఘాల మీద పెళ్లి చేసుకుందని తెలిపింది. మ్యారేజ్ ఘనంగా చేస్తే, తక్కువ టైమ్‌లో పుట్టబోయే బిడ్డ గురించి లెక్కలు తీసి దీనిపై డిస్కషన్లు పెడతారని భావించి సైలెంట్‌గా కానిచ్చేసిందని ఆ పోర్టల్ రాసుకొచ్చింది. నాలుగైదు రోజులుగా ఈ తరహా వార్తలొస్తున్నా కనీసం స్పందించలేదు నేహా. మరి ఇందులో నిజమెంతో? ఇవన్నీ పుకార్లంటూ నేహా కొట్టిపారేస్తుందో ఏమో చూడాలి.

Related News