హైదరాబాద్ ఐకియాలో కలకలం, ఈసారి కేక్‌లో

హైదరాబాద్‌లోని ఐకియా స్టోర్ మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. ఈ సంస్థకు చెందిన ఫుడ్‌ కోర్టుకి కష్టాలు తప్పడంలేదు. నిన్నటికి నిన్న శాఖాహార బిర్యానీలో గొంగళి పురుగు కనిపించగా, ఇప్పుడు కేక్‌ వంతైంది. దీంతో ఇక్కడ ఏమైనా తినాలంటే కస్టమర్స్ వెనక్కి జంకుతున్నారు. కిషోర్ అనే వినియోగదారుడు ఈనెల 12న ఐకియా స్టోర్‌కి ఫ్యామిలీతో వెళ్లాడు. కూతురు కోసం ఓ చాక్లెట్ కేక్‌ని తీసుకుంటుండగా నల్లటి పురుగు కనిపించడంతో షాకయ్యాడు. దీనిపై ఫిర్యాదు చేశాడు.

ఫోటోలు, వీడియో, బిల్లుతో కలిసి సోషల్‌మీడియా ద్వారా మీడియాతో పంచుకున్నాడు. కొద్దిరోజుల కిందట శాఖాహార బిర్యానీలో గొంగళి పురుగు వచ్చిన ఘటన కలకలం సృష్టించింది. కస్టమర్ ఫిర్యాదుకి అధికారులు స్పందించారు. నిర్వాహకులకు ఫైన్ కూడా వేశారు. దీనిపై అధ్యయనం నిర్వహించి లోపాలను సరి చేసుకుంటామని చెప్పిన ఐకియా ప్రతినిధులు, ఆ మాటను పక్కన పెట్టేశారు.

 

Related News