ఏపీకి హోదా కోసమే కాంగ్రెస్‌లో చేరా

ఏపీకి ప్రత్యేక హోదాకోసమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని బైరెడ్డి రాజశేఖరరెడ్డి తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీకి హోదా ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమని, ప్రాంతీయ పార్టీలతో హోదా రాదని అన్నారు.

చంద్రబాబు, జగన్‌ల ఆరాటం పదవులపైనేనని, వారికి రాష్ట్ర ప్రయోజనాలపై ఆసక్తి లేదని బైరెడ్డి ఆరోపించారు. వారివల్లే రాష్ట్ర విభజన జరిగిందని అన్నారు. ఈ నెల 24న వైసీపీ ఇచ్చిన బంద్ పిలుపును ఎవరూ పట్టించుకోరాదని ఆయన సూచించారు. త్వరలో కర్నూలులో బహిరంగ సభ నిర్వహించి..ఏపీకి హోదాపై పోరాటం ప్రారంభిస్తానని ఆయన చెప్పారు.

Related News