పోలీసులు ఉన్నారన్న ధైర్యంతోనే ప్రేమ పెళ్లి

మిర్యాలగూడలో తన భర్త ప్రణయ్ హత్య ఘటననుంచి అతని భార్య అమృత వర్షిణి తేరుకోలేకపోతోంది. తమ ఇంట్లో కులాంతర వివాహాలను ఏమాత్రం అంగీకరించబోరని తనకు తెలుసునని, అయితే పోలీసులు, మీడియా ఉన్నారన్న ధైర్యంతోనే ప్రేమపెళ్ళి చేసుకున్నానని ఆమె తెలిపింది. తన తండ్రే ఈ ఘాతుకానికి ఒడిగడతా‌డని ఊహించలేకపోయానని కన్నీటిపర్యంతమయ్యింది.  తమ బంధువుల అమ్మాయి..తనకు వరుసకు అక్క అయిన యువతి కులాంతర వివాహం చేసుకుంటే తన బాబాయి ఆమెను బలవంతంగా ఇంటికి తీసుకువచ్చి..తాళి తెంపేసి ఆమెకు మరో పెళ్లి చేశాడని అమృత పేర్కొంది. నన్ను ప్రణయ్ ఎంతో బాగా చూసుకునేవాడు. కొత్త ప్రదేశానికి వెళ్ళాలంటే ఇద్దరం చాలా భయపడేవాళ్ళం. అయితే ఆసుపత్రి ముందు నడిరోడ్డుపైనే ఇంత కిరాతకానికి పాల్పడతారని ఏమాత్రం అనుకోలేదు అని అమృత వెల్లడించింది.

Related News