నా కొడుకు జాడ కనిపెట్టరూ?

హైదరాబాద్‌కు చెందిన 36 ఏళ్ళ టెక్కీ… పాండు రాఘవేంద్రరావు అమెరికాలో గత ఏడాది అక్టోబరునుంచి కనిపించకపోవడంతో అతని కుటుంబం అల్లాడుతోంది. తన కొడుకు జాడ కనుగొనేలా చూడాలంటూ రాఘవేంద్రరావు తండ్రి పి.బంగారం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు, అమెరికాలోని భారత రాయబార కార్యాలయానికి లేఖలు రాశారు.

కాలిఫోర్నియాలోని మైక్రోసాఫ్ట్ కంపెనీలో పని చేసేందుకు తన కుమారుడు 2011 డిసెంబరు 26 న వెళ్ళాడని రిటైర్డ్ ఇంజనీర్ అయిన బంగారం తెలిపారు. తాను ఎప్పటికప్పుడు ఫోన్, వాట్సాప్ ద్వారా రాఘవేంద్రరావుతో  టచ్‌లో ఉండేవాడినని, అమెరికాలో తన కొడుకు సంతోషంగానే ఉండేవాడని ఆయన పేర్కొన్నారు. నా కుమారుడి విషయంలో హెల్ప్ చేయాలని  తెలంగాణా మంత్రి కేటీఆర్‌కు కూడా విజ్ఞప్తి చేశా అని ఆయన తెలిపారు. బంగారం… ఎంబీటీ నేత అమ్జాద్ ఉల్లా‌ఖాన్‌ను కూడా కలుసుకోగా.. ఆయన ఆవేదనను ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన ఒకే ఒక కొడుకు జాడ కనుక్కోవాలని ఈ తండ్రి దీనంగా అభ్యర్థిస్తున్నాడు.

Related News