మేయర్ బొంతు రామ్మోహన్ అలక

హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ అలక వహించారు. తెరాస అధినేత కేసీఆర్ ప్రకటించిన 105 మంది తొలి అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. ఉప్పల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన ఆశించినా.. కేసీఆర్ టికెట్‌ను భేతి సుభాష్ రెడ్డికి ఖరారు చేశారు. దీంతో మనస్తాపానికి గురైన రామ్మోహన్ గురువారం జరిగిన జీ‌హెచ్‌ఎం‌సీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి గైర్ హాజరయ్యారు. తన ఫోన్ కూడా స్విచాఫ్ చేసుకున్నారు.

Related News