అమెరికాను చుట్టేసిన రాకాసి తుపాన్

ఆగ్నేయ తీరంలో అలజడి రేగడంతో అమెరికన్ రాష్ట్రాలన్నీ అప్రమత్తమయ్యాయి. 140 కిలోమీటర్ల వేగంతో రాకాసి గాలులతో దూసుకొస్తున్న హరికేన్ ఫ్లోరెన్స్.. ఆ దేశాన్ని వణికిస్తోంది. అత్యంత భయానకమైందిగా భావిస్తున్న ఈ తుపాన్ తీవ్రతను కేటగిరీ5 గా పరిగణిస్తున్నారు. వర్జీనియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా రాష్ట్రాలకు పెనుముప్పు తప్పకపోవచ్చని తెలుస్తోంది. వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సిందిగా దాదాపు పది లక్షల మందికి ఆదేశాలు జారీ అయ్యాయి.

Related News