ఎన్టీఆర్ బయోపిక్‌లో చిన్నమ్మిదిగో..!

నటసార్వభౌముడు ఎన్టీఆర్‌ జీవిత ప్రస్థానం ఒక చరిత్ర. అలాంటి చరిత్రను తెరకెక్కించే బాధ్యతను భుజానవేసుకున్న దర్శకుడు క్రిష్, ఈ సినిమాలోని ప్రతీ పాత్రను సహజత్వానికి దగ్గరగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం ఆయా పాత్రలకు నటీనటుల్ని ఎంపిక చేస్తున్నాడు. ఇప్పటికే సినిమాలోని అనేక కీలక పాత్రల్లో నటించే తారాగణాన్ని ఎంపిక చేసేసిన క్రిష్, ఇప్పుడు ఎన్టీఆర్ కూతురు చిన్నమ్మ(పురందేశ్వరి) రోల్ కు కూడా ఒకామెను ఫైనల్ చేసినట్టు వినిపిస్తోంది. విజయవాడకు చెందిన హిమాన్సి చౌదరి అనే డ్యాన్సర్‌ పురంధరేశ్వరి రోల్ చేయబోతోందట. దీనికి బలం చేకూరుస్తూ పురంధరేశ్వరి – హిమన్సీ చౌదరి కలిసి దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్రలో భరత్ రెడ్డి కనిపించనున్నారు.

Related News