తెరపై పవన్ ఫస్ట్ హీరోయిన్

చాన్నాళ్ల తర్వాత పవన్‌కల్యాణ్‌ ఫస్ట్ మూవీలో నటించిన హీరోయిన్ సుప్రియ లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ మూవీతో గ్లామర్ ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈమె. ఆ తర్వాత వెండితెరకు దూరమైంది. నాగార్జున మేడకోడలైన సుప్రియ, ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియో బ్యాన‌ర్‌పై తెరకెక్కే సినిమాల నిర్మాణ బాధ్యత‌ల‌ను నిర్వహిస్తోంది. ఇన్నాళ్లకు వెండితెరపై రీఎంట్రీ ఇస్తోంది.

అడివిశేష్ నటించిన ‘గూఢచారి’ మూవీలో కీలకమైన పాత్ర చేస్తోంది సుప్రియ. రీసెంట్‌గా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ వచ్చినప్పటికీ అందులో సుప్రియ ఎవరన్నది అభిమానులు గుర్తు పట్టలేదు. ఈక్రమంలో సుప్రియ లుక్‌ని అభిమానులతో షేర్ చేశాడు అడవిశేష్. ఫస్ట్ మూవీలో ఎలాగైతే వుందో.. ఇప్పుడు అలాగే వుందని, ఏ మాత్రం మార్పులేదంటున్నారు అభిమానులు. ఇంతకీ సుప్రియకు గూఢచారిలో అంత ఇష్టమైన పాత్ర ఏముందో? అనేది ఆసక్తికరంగా మారింది. సుప్రియ రీఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలంటే వచ్చేనెల వరకు ఆగాల్సిందే!

READ ALSO

Related News