అక్కా.. నీలాగే నేనూ..

తక్కువ సినిమాలతో టాలీవుడ్‌లో పాపులర్ అయ్యింది హీరోయిన్ సాయిపల్లవి. కోలీవుడ్ నుంచి గ్లామర్ ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చినా, ఆమెకి లైఫ్ ఇచ్చింది టాలీవుడే! ఫిదాతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది సాయిపల్లవి, ప్రస్తుతం చాలా బిజీబిజీగా ఉంది. తొలిసారి తన చెల్లెలు పూజతో కలిసున్న పిక్‌ని అభిమానులతో షేర్ చేసింది. ఇద్దరు అందంగా కెమెరాకి పోజిచ్చారు. ఈ పిక్ సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది.

వున్నట్లుండి పూజ పిక్ బయటపెట్టడం వెనుక అసలు మేటర్ ఏంటి అంటూ చర్చించుకోవడం గ్లామర్ ఇండస్ర్టీ వంతైంది. ఇంతకీ సాయి చెల్లెలు పూజ కూడా గ్లామర్ ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇస్తోందా? అంటూ నెటిజన్స్ ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. అక్కాచెల్లెలు సినిమాల్లో నటించిన సందర్భాలు గతంలోనే వున్నాయి. అర్తి అగర్వాల్- అదితి అగర్వాల్.. ఇలా చెప్పుకుంటూపోతే చాలామందే వున్నారు. ఈ జాబితాలోకి పూజ చేరుతుందా? లేదా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే!

READ ALSO

Related News