కేరళ వరదల్లో మా ‘జర్నీ’ కష్టాలు.. హీరోయిన్ అనన్య ఆవేదన

భారీ వర్షాలు కేరళని సర్వ నాశనం చేశాయి. ఉండటానికి గూడు కూడా లేని పరిస్థితి అక్కడి ప్రజలది. ఇప్పటివరకు 400 మంది మృతి చెందినట్టు అధికారుల ప్రకటన. ఈ విపత్తులో తాను చిక్కుకున్నానంటూ హీరోయిన్ అనన్య ఆవేదన వ్యక్తం చేసింది. వరదల్లో నా ఇల్లు నీటిలో మునిగిపోయింది. శుక్రవారం ఉదయం వరకు కుటుంబసభ్యులంతా సురక్షితంగా ఉండగలిగాం. ప్రస్తుతం పెరుంబవూర్‌లోని నటి ఆశాశరత్‌ (‘భాగమతి’ సినిమాలో పోలీసు అధికారిణి) ఇంట్లో ఉంటున్నానని తెలిపింది.

Posted by Ananyaa on Friday, August 17, 2018

 

రెండురోజులు జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోని దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నామని మనసులోని ఆవేదనను వెళ్లగక్కింది. టాలీవుడ్‌లో ‘జర్నీ’తో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు, ఆ తర్వాత ‘అ..ఆ..’ మూవీలోనూ నటించింది. ఐతే, తమ కుటుంబ దుస్థితిపై ఇంకా ఏమందో ఆమె మాటల్లోనే..

Posted by Ananyaa on Wednesday, August 15, 2018

Related News