కూల్.. అంటున్న నాని భార్య

‘కాస్టింగ్ కౌచ్’ సెన్సేషన్ శ్రీరెడ్డి ఎపిసోడ్ కొత్త మలుపు తిరిగింది. మొదట్లో ఒక స్టార్ ప్రొడ్యూసర్ ఫ్యామిలీని టార్గెట్ చేసి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌ని దుర్భాషలాడి, ఆమధ్య దర్శకుడు శేఖర్ కమ్ముల ఆగ్రహానికి గురై.. ఇప్పుడు న్యాచురల్ స్టార్ నానిని ‘తగులుకుంది’ శ్రీరెడ్డి. నానీ మీద ఆమె చేస్తున్న అభ్యంతరకర పోస్టులు.. టాలీవుడ్‌లో కంపరం పుట్టిస్తున్నాయి. ఆమె మీద లీగల్ ఫైట్‌కి కూడా సిద్ధమయ్యాడు నాని. ఇదిలా ఉంటే.. నానీ డిగ్నిటీ మీద, ప్రీమారిటల్ లైఫ్ మీద శ్రీరెడ్డి చేసిన కామెంట్స్.. పరిశ్రమను కొత్త రకం రోతలోకి దింపేశాయి. నానీ క్యారెక్టర్‌కి సపోర్ట్‌గా కొందరు, శ్రీరెడ్డి వెర్షన్‌కి ఊతంగా కొందరు మాట్లాడ్డం మొదలుపెట్టేశారు. ఈ క్రమంలో.. నాని భార్య అంజనా ఎలమర్తి సీన్లోకొచ్చేశారు. ఇండస్ట్రీ మీద మనకుండే గొప్ప నమ్మకాన్ని.. కొందరు పబ్లిసిటీ కోసం చేసే పిచ్చి పిచ్చి స్టంట్లతో పోగొడ్తుంటారని, కానీ అటువంటి చేష్టల్ని ఎవ్వరూ నమ్మబోరని ఆమె ట్వీట్ చేశారు. మిగతా వాళ్ళ జీవితాల్ని ప్రభావితం చేసేంతగా ఈ చర్యలు దిగజారిపోవడమే బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తోందామె. మొత్తమ్మీద నానీకి ఇంటి నుంచి.. ఇల్లాలి నుంచి గట్టి మోరల్ సపోర్ట్ దొరికినట్లయింది.

Related News