హీరో ధనుష్.. క్షేమం!

కోలీవుడ్ హీరో ధనుష్ క్షేమంగానే వున్నారు. ఐ యామ్ సేఫ్ .. అంటూ ఫ్యాన్స్‌నుద్దేశించి ట్వీట్ చేశాడు. వివరాల్లోకి వెళితే..! ప్రస్తుతం ధనుష్ మారి2 మూవీని వర్కవుట్ చేస్తున్నాడు. 2015లో రిలీజైన మారి మూవీకి ఇది సీక్వెల్. సాయిపల్లవి హీరోయిన్ గా చేస్తోంది. చెన్నై శివార్లలో దీనికి సంబంధించి షూటింగ్ జరుగుతోంది. అయితే.. ఒక యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్న సమయంలో ధనుష్ గాయపడ్డారని వార్తలొచ్చాయి. స్టంట్ చేస్తుండగా.. కింద పడి ఎడమ మోకాలు, కుడి చేతికి గాయాలయ్యాయని, డాక్టర్ సలహా మేరకు రెండురోజులు షూటింగ్ నిలిపివేసి ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారని కోలీవుడ్ న్యూస్ చెబుతోంది. ఈ మేటర్ తెలుసుకున్న ధనుష్-రజనీ ఉమ్మడి ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ.. సోషల్ మీడియాలో ‘గెట్ వెల్ సూన్’ అంటూ మెసేజిల పరంపరను మొదలుపెట్టారు.

దీంతో ధనుష్ తేరుకుని.. ‘నా ప్రియమైన అభిమానులారా.. ఆందోళన చెందకండి.. ఇదేం పెద్ద గాయం కాదు. మీ అందరి ప్రేమాభిమానాలు, ప్రార్థనల వల్ల త్వరగా కోలుకుంటున్నాను..’ అంటూ ట్వీట్ చేశాడు. మూడురోజుల కిందటే.. ధనుష్ ముద్దుల కొడుకు ‘లింగా’ పుట్టినరోజు సందర్భంగా అతడ్ని ఎత్తుకుని తీసుకున్న ఫోటోని పోస్ట్ చేశాడు.

READ ALSO

Related News