ఆది కొత్త సినిమా షురూ

డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది కొత్త సినిమా హైదరాబాద్ ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో గ్రాండ్ గా లాంచ్ అయింది. హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై శ్రీనివాస నాయుడు నడికట్ల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ కార్యక్రమంలో వంశీ పైడిపల్లి క్లాప్ కొట్టగా. డీసీపీ కృష్ణమోహన్ కెమెరా స్విచాన్ చేశారు. సాయికుమార్ స్క్రిప్ట్ అంద జేశారు. హీరో నాగశౌర్య, నిర్మాత భరత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఇది ప్యూర్ లవ్ స్టోరీ అని, ఇందులో తాను రెండు షేడ్స్ లో కనిపిస్తానని హీరో ఆది తెలిపాడు. త్వరలో హీరోయిన్ ను ప్రకటిస్తామన్నాడు. రాజీవ్ కనకాల, రాధిక, రావు రమేష్, అజయ్ ముఖ్య తారాగణమని తెలుస్తోంది.

READ ALSO

Related News