సన్నీ మారింది, మరి మనం..

బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్‌ని అలనాటి బ్యూటీలైన నర్గీస్, మాధురిదీక్షిత్, శ్రీదేవిలతో పోల్చాడు గుజరాత్ పటీదార్ నేత హార్దిక్ పటేల్. సన్నీపై మీ అభిప్రాయం ఏంటని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు తనదైనశైలిలో రిప్లై ఇచ్చేశాడు. సన్నీలియోనీని ఇతర నటీనటుల మాదిరిగా ఎందుకుచూడరు? నర్గిస్, శ్రీదేవి, మాధురిదీక్షిత్‌ మాదిరిగానే సన్నీ కూడా ఒక నటి అని గుర్తుచేశాడు.

గతంలో పోర్న్‌స్టార్‌గా పని చేసిందని, ఇప్పుడూ అదే దృష్టితో ఆమెని చూడటం సరికాదన్నాడు. ఒకవేళ మన ఆలోచనా విధానం మారకపోతే దేశం ఎప్పటికీ మారదని ఒక్క ముక్కలో తేల్చేశాడు. ఓటర్లకు రాజకీయాలపై అవగాహన కల్పించేందుకు హార్దిక్‌ జులై నుంచి మధ్యప్రదేశ్‌లో పాదయాత్ర చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఓ జర్నలిస్ట్ వేసిన ప్రశ్నకు పైవిధంగా రిప్లై ఇచ్చాడు.

READ ALSO

Related News