అద్దం దగ్గర అడ్డంగా దొరికిన అల్లరోళ్లు

విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. పర్యటనలో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో భారత్‌ టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లు ఆడనుంది. ఇరు జట్ల మధ్య రేపటి నుంచి టీ20 సిరీస్‌ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో అక్కడి హోటల్ లో బస చేసిన టీమిండియా క్రికెటర్లు శిఖర్‌ ధావన్‌, హార్దిక్‌ పాండ్య అద్దం ముందు అల్లరి చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. వీళ్లిద్దరూ కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియోపై కామెంట్ల మీద కామెంట్లు పడుతున్నాయి. ఈ వీడియోను హార్దిక్‌ పాండ్య తన ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకోవడం తో ఈ వీడియో మరింత వైరల్ అయింది. ‘నేను, జట్టా(శిఖర్‌ ధావన్‌ను టీంమేట్స్ పిలుచుకునే పేరు) డ్యాన్స్‌ చేస్తూ దొరికిపోయాం. మా ఇద్దరికీ డ్యాన్స్‌, పాటలు పాడటం అంటే చాలా ఇష్టం’ అని పాండ్య తన ట్విట్టర్ అకౌంట్ లో చెప్పుకొచ్చాడు. ఇదే ఆ వీడియో..

Related News