భయాందోళనలో మేఘన ట్రావెల్స్ ప్రయాణికులు

మేఘన ట్రావెల్స్ నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. అదృష్టవశాత్తూ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుకున్నారు ఆ బస్సులో ప్రయాణీస్తోన్న ప్రయాణీకులు. లేదంటే బస్సులో ఉన్న దాదాపు 30మంది ప్రాణాలు అగ్నికి ఆహుతైపోయి ఉండేవి. గత రాత్రి హైదరాబాద్ నుంచి గిద్దలూరుకు బయల్దేరింది మేఘన ట్రావెల్స్ బస్సు. బీహెచ్ఈఎల్ నుంచి బయలుదేరిన బస్సు ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ పైకి రాగానే దాని డీజిల్ ట్యాంకు ఊడి కిందపడింది. గుర్తించని డ్రైవర్ బస్సును ముందుకు పోనిస్తూనే ఉన్నాడు.

విషయం గమనించిన ప్రయాణికులు కేకలు వేయడంతో ఎట్టకేలకు డ్రైవర్ బస్సును ఆపాడు. అయితే, ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేవేయాల్సిన మేఘన ట్రావెల్స్ యాజమాన్యం పూర్తి అలసత్వం ప్రదర్శించింది. ఎంతమొత్తుకున్నా మరో బస్సు ఏర్పాటు చేయకపోవడంతో. ప్రయాణీకులు బ్రతుకు జీవుడా అంటూ రాత్రంతా రోడ్డుపై తచ్చాడాల్సిన అగత్యం పట్టింది. ప్రయివేట్ ట్రావెల్స్ ఆగడాలకు హద్దే లేకుండా పోతోందని ఈ సందర్భంగా ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related News