ఏపీ..వయాగ్రా కొంటే మీ పర్సనల్ డేటా ఔట్

ఏపీలో ఇదో విచిత్రం ! అక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఓ స్టోర్స్ లో వయాగ్రా కొనుగోలు చేసినవారి పర్సనల్ డేటాను వారి ఫోన్ నెంబర్లతో సహా ఓ వెబ్‌సైట్ లీక్ చేసిందట. పైగా ఈ సైట్ ప్రైవేటుది కూడా కాదు..  సర్కారీ సైట్ ! ఈ నెల 13‌న ఆ స్టోర్స్‌లో వయాగ్రా కొనుక్కున్నవారి పేర్లను తెలుసుకునేందుకు ఎవరికైనా యాక్సెస్ కల్పించే వెసులుబాటును ఈ సైట్ కల్పించిందని శ్రీనివాస్ కొడాలి అనే సెక్యూరిటీ రీసెర్చర్ పసి‌గట్టారు.. ఈ బగ్‌ను మొదట కనుక్కున్న ఆయన దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే..
అనంతపురంలోని ‘ అన్న సంజీవిని ‘ స్టోర్స్ నుంచి వయాగ్రా మరో వెర్షన్ అయిన ‘ సుహాగ్రా-50 ‘ ని ఈ నెల 13 న కొందరు కొనుగోలు చేశారు. ఈ వివరాలను ఆంధ్ర సంజీవిని వెబ్‌సైట్ డ్యాష్‌బోర్డ్ ఎంచక్కా ఆన్‌లైన్‌లో పెట్టింది. చివరకు ఈ నిర్వాకం బయటపడడంతో సంబంధిత లింక్ ను పని చేయకుండా చేశారు. హెల్త్ కేర్ యాక్ట్ ముసాయిదాలో డిజిటల్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ నేపథ్యంలో మందులు కొనుగోలు చేసేవారి మెడికల్ డేటాను ప్రభుత్వం కాపాడలేకపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ ఏడాది ఆరంభంలో ఏపీ ప్రభుత్వ వెబ్‌సైట్ రెండు పెద్ద సెక్యూరిటీ బ్రీచ్‌లతో అన్-పాపులర్ అయింది. దీని నిర్వాకం కారణంగా  1.34 లక్షలమంది పౌరుల ఆధార్ డేటా లీకయింది. అలాగే రెండోసారి సుమారు 89 లక్షలమంది కార్మికుల ఆధార్ వివరాలు కూడా బయటకు పొక్కాయన్నది హఫింగ్ టన్ పోస్ట్ పత్రిక కథనం.  ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఇలాంటి ‘ భారీ ‘ పొరబాట్లు జరగకుండా చూడాల్సి ఉంది.

Related News