హైదరాబాదీలకు గుడ్ న్యూస్

విభిన్నమతాలు, జాతులు, వర్గాల జీవనంతో విశ్వనగరంగా మారుతోన్న హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యను నివారించడం కోసం కేసీఆర్ సర్కారు కొత్త ఆలోచన చేసింది. నగరనలువైపులా శివార్లలో అంతర్జాతీయ హంగులు, సకల సౌకర్యాలతో ఇంటర్‌సిటీ బస్ టెర్మినల్స్ (ఐసీబీటీ) నిర్మించాలని నిర్ణయించింది. వీటిని మియాపూర్, మనోహరాబాద్, పెద్ద అంబర్‌పేట, శంషాబాద్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందులో భాగంగా జాతీయ రహదారులకు సమీపంలో అత్యాధునిక హంగులు, అంతర్జాతీయ ప్రమాణాలు, సకల మౌలిక వసతులతో కూడిన బస్ టెర్మినళ్ల నిర్మాణానికి హెచ్‌ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది.

వీటి నిర్మాణానికి 20-100 ఎకరాల వరకు స్థలం అవసరమవుతుందని అంచనా వేశారు. స్థల సేకరణ పనులు ముమ్మరం చేశారు. ఈ నాలుగు టెర్మినళ్లను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో చేపట్టనున్నారు. ఒక్కోదానికి రూ.70 కోట్ల నుంచి రూ.100 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. వీటిని కనీసం 100 బస్సులకు తగ్గకుండా నిలిపే సామర్థ్యంతో నిర్మించనున్నారు.

Related News