దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం

బెజవాడ కనక దుర్గమ్మకు తెలంగాణ భక్తులు బంగారు బోనం సమర్పించారు. భాగ్యనగర్ మహంకాళి ఉత్సవ కమిటీ ఆధ్వర్యాన ఏటా దుర్గమ్మకు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సారి బంగారు బోనం సమర్పించడం విశేషం.

ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గాజుల అంజయ్య నేతృత్వాన విజయవాడ చేరుకున్న బృందం.. మొదట జమ్మిదొడ్డిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడి నుంచి ఇంద్రకీలాద్రి వరకు ఊరేగింపు నిర్వహించింది. ఇందులో వందలాది భక్తులు, కళాకారులు పాల్గొన్నారు.

వివిధ రకాల వేషధారణలతో వీరి ఊరేగింపు కనులవిందుగా సాగింది. ఏపీకి ప్రత్యేక హోదా దక్కాలని, రెండు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో గడపాలని, కలిసిమెలిసి ఉండాలని కోరుతూ తాము బంగారు బోనాన్ని సమర్పిస్తున్నట్టు అంజయ్య తెలిపారు.

Related News