సీఎం పారికర్‌‌కు ఏమైంది? ఎయిమ్స్‌‌లో ట్రీట్‌మెంట్

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోవా సీఎం మనోహర్ పారికర్, మెరుగైన వైద్యం ఢిల్లీలోని ఎయిమ్స్‌కి షిఫ్ట్ అయ్యారు. ప్యాంక్రియాటిక్ సమస్యతో బాధపడుతున్న ఆయన, ప్రస్తుతం గోవాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యం కోసం మూడునెలల కిందట అమెరికా వెళ్లారు ఆయన.

ఐతే, శనివారం ఉదయం మెరుగైన వైద్యం కోసం పారికర్ ఎయిమ్స్‌కి వెళ్తారని, ఆయన కోసం ప్రత్యేక విమానాన్ని ఢిల్లీ నుంచి పీఎం మోదీ పంపినట్టు వార్తలొస్తున్నాయి. అనారోగ్యం దృష్ట్యా తాను సీఎంగా కొనసాగలేనని, ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలకు ఇదివరకే పారికర్ చెప్పినట్టు ఢిల్లీ సమాచారం. ఇప్పటికిప్పుడు సీఎంని మార్చడం కష్టమని, కొద్దిరోజులు ఆగాలని షా అన్నట్లు తెలుస్తోంది.

Related News