మాక్‌డ్రిల్ ఆమె ప్రాణం తీసింది

తమిళనాడు కోయంబత్తూరులోని ఓ కళాశాలలో నిర్వహించిన మాక్‌డ్రిల్ ఓ విద్యార్థిని ప్రాణం తీసింది. అక్కడి కలైమగల్ ఆర్ట్స్ కాలేజీలో నేషనల్ డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ బృందం గురువారం మాక్‌డ్రిల్ నిర్వహించింది. ట్రైనర్ టీ.ఆర్.ఆర్ముగం పర్యవేక్షణలో విద్యార్థులను రెండో అంతస్తు నుంచి కిందకు దూకాలని కోరారు. ప్రమాద సమయాల్లో విద్యార్థులు సాహసోపేతంగా బాధితులను రక్షించే సహాయ కార్యక్రమంలో భాగంగా ఇలాంటి డ్రిల్స్ నిర్వహిస్తుంటారు.

కాగా… ఇదే కళాశాలలో బీబీయే రెండో సంవత్సరం చదువుతున్న లోకేశ్వరి అనే విద్యార్థిని రెండో అంతస్తు నుంచి దూకేందుకు భయపడడంతో ఆర్ముగం ఆమెను బలవంతంగా కిందకు తోసేశాడు. కిందపడుతుండగా ఆమె తల మొదటి అంతస్తు గోడకు తగిలి తీవ్ర రక్త స్రావమై గాయపడింది. ఈ ఘటనను విద్యార్థుల్లో కొందరు వీడియో తీశారు. అటు-లోకేశ్వరిని ఆసుపత్రికి తరలిస్తుండగా..మధ్యలోనే మరణించింది. మృతురాలి తలిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఆర్ముగంను అరెస్టు చేశారు.

READ ALSO

Related News