ప్రియుడు కాదన్నాడని…

ప్రేమించిన ప్రియుడు ముఖం చాటేస్తున్నాడని, పెళ్లి మాట ఎత్తేసరికి పత్తా లేకుండాపోతున్నాడని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ యువతి ఏకంగా సెల్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగింది. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం చందుపట్ల గ్రామానికి చెందిన పల్లపు జ్యోతి అనే ఈ యువతి, వలిగొండ మండలకేంద్రవాసి రావుల భాస్కర్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.  అయితే జ్యోతి కొన్నిరోజులుగా పెళ్లి మాట ప్రస్తావించేసరికి భాస్కర్ నిరాకరిస్తూ వచ్చాడట. దీంతో ఆమె  అతనిపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయినా ప్రయోజనంలేకపోయిందని తెలిసింది. పైగా మరో అమ్మాయితో భాస్కర్ పెళ్ళికి సిద్ధ పడుతున్నాడని తెలుసుకున్న జ్యోతి.. మూడు రోజులుగా ప్రియుడి ఇంటిముందు బైఠాయించి నిరసన తెలిపిందని, కానీ అతడు గానీ, అతని కుటుంబ సభ్యులు గానీ స్పందించకపోవడంతో .. సెల్ టవర్ ఎక్కిందని తెలుస్తోంది.

Related News