గుండెల్లోన వేగం పెంచావే.. గుమ్మంలోకి హొలీ తెచ్చావే..

టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ నుంచి మరో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గ్యారంటీ అన్న క్లారిటీ వస్తోంది. తాజాగా అతడు హీరోగా చేస్తున్న ‘గీత గోవిందం’ మూవీకి సంబంధించి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అనంత్ శ్రీరామ్ మాస్ పొయెటిక్ లైన్స్, గోపీ సుందర్ బీట్స్, సిద్ శ్రీరామ్ ప్లేబ్యాక్ పెర్ఫామెన్స్ కలగలిసి.. ఈ పాటను ఎక్కడో నిలబెట్టింది. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలె అంటూ సాగే ఈ రొమాంటిక్ బ్యాక్‌గ్రౌండ్ సాంగ్.. సగటు ప్రేక్షకుడిని అమితంగా ఆకట్టుకుంటోంది. పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ‘గీతగోవిందం’ మూవీని గీతా ఆర్ట్స్2 బేనర్ మీద బన్నీ వాస్ తీస్తున్నాడు. ఫిమేల్ లీడ్ రోల్ రష్మిక మందన చేస్తోంది.

Related News