మనవడు ఫిల్మ్‌కి క్లాప్ కొట్టిన నటశేఖరుడు

టాలీవుడ్‌లో వార‌సుల ప‌రంప‌ర కంటిన్యూ అవుతోంది. తాజాగా మహేష్‌బాబు బావ, గ‌ల్లా జయదేవ్ కొడుకు, సూపర్‌స్టార్ కృష్ణ‌ మనవడు అశోక్ టాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు. అశోక్ డెబ్యూ ఫిల్మ్ పూజా కార్యక్రమాలు  గురువారం ఉదయం  హైదరాబాద్‌లో జరిగాయి. దీనికి తొలిక్లాప్ నటుడు కృష్ణ కొట్టారు. ‘అదే నువ్వు అదే నేను’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. త్వర‌లోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.

అశోక్ పక్కన న‌భా న‌టాషా హీరోయిన్. హిప్ హాప్ త‌మీజా దీనికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ కార్యక్రమానికి సూప‌ర్‌స్టార్ కృష్ణ‌, రాఘ‌వేంద్రరావు, మంజుల, దిల్‌రాజు తదితరులు హాజ‌ర‌య్యారు.

ఈ చిత్రంతో శ‌శి ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం కానున్నాడు. తన న‌ట‌న‌కి సంబంధించి అశోక్ కొన్నాళ్ళు అమెరికాలో ట్రైనింగ్ తీసుకున్నట్టు సమాచారం. మరి అశోక్ తెలుగు ప్రేక్షకుల‌ని ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.

Related News