వానలకోసం ప్లాస్టిక్ కప్పల పెళ్లి

ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఓ వింత ! వర్షాలు కురవాలంటూ స్థానికులు రెండు ప్లాస్టిక్ కప్పలకు పెళ్లి చేయడం విశేషం. పైగా కొత్త పెళ్ళికొడుకు, కూతురు వేషంలో యువతీ యువకులు పూలమాలలతో అలంకరించిన ప్లాస్టిక్ కప్పల ప్లేటును పట్టుకుని కెమెరాలకు పోజులిచ్చారు. కాశీ పుణ్యక్షేత్రమైన వారణాసిలో అనేక చోట్ల ఈ సారి తీవ్ర వర్షాభావ పరిస్థితి ఏర్పడిందని, అందువల్ల వానలకోసం.. ఇంద్ర దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఇలా కప్పల పెళ్లి తలపెట్టామని సంస్కృత మంత్రాలు చదివిన పూజారులు చెబుతున్నారు. పైగా ఈ ‘ వింత పెళ్లి ‘ కి ముందు జరిగిన ఓ ‘ ఊరేగింపు ‘ లో స్థానిక మహిళలు కూడా పాల్గొన్నారు. దేశంలో  వర్షాలు కురవని చోట సాధారణంగా కప్పలకు పెళ్ళిళ్ళు చేస్తుంటారు. మరి-ఈ వినూత్న ప్రయోగం ఫలిస్తుందో లేదో చూడాలి !

Related News