ఎమ్మెల్యే తమ్ముడి గన్‌‌కౌంటర్

దేశ రాజధానిలో మాజీ ఎంపీ కొడుకు పబ్లిక్‌గా గన్ పట్టుకుని చేసిన వీరంగం అది. ఓ జంట పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమేకాదు వాగ్వాదానికి దిగాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. లొకేషన్ ఢిల్లీ, సమయం.. ఆదివారం అర్ధరాత్రి. ఫైవ్‌స్టార్ హోటల్‌ వద్ద బీఎస్పీ మాజీ ఎంపీ కొడుకు ఆశిష్‌పాండే గన్‌తో ఓ జంట పట్ల కనిపించిన తీరు ఇది.

ఈ క్రమంలో కారులోనుంచి వచ్చిన ఓ మహిళ.. ఆశిష్‌ని ఆపే ప్రయత్నం చేసింది. జంటని ఆశిష్ బెదిరిస్తుండగా, హోటల్‌ సిబ్బంది అతడ్ని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఆదివారం రాత్రి హోటల్‌ ముందు జరుగుతున్న ఈ తతంగాన్ని ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్‌తో చిత్రీకరించి సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేశాడు. వైరల్‌ అయిన వీడియోపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. వెంటనే ఆశిష్‌పై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు. రేపోమాపో అతడ్ని అరెస్ట్‌ చేయనున్నారు.

Related News