స్కూల్లో ఫైటింగ్..ఏం జరిగిందంటే..

తమిళనాడు కోయంబత్తూరు జిల్లాలో దారుణం.. అక్కడి కయత్తూరులోని ఫాతిమా మెట్రిక్యులేషన్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు క్లాస్‌రూమ్‌లోనే గొడవపడి కొట్టుకున్నారు.

వడయార్ అనే విద్యార్ధి..నరసింహన్ అనే మరో విద్యార్థిని గాల్లోకి లేపి కిందకేసి కొట్టాడు. క్లాస్‌రూమ్‌లోని సీసీటీవీ కెమెరాలో ఈ ఘటన రికార్డయ్యింది. కాగా.. తల, నడుముకు గాయాలైన నరసింహన్‌ను తోటి విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే నరసింహన్ మరణించినట్టు డాక్టర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. తనను ఏం చేస్తారోనన్న భయంతో వడయార్ స్కూలు పక్కనే ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే నిజంగానే సూసైడ్ చేసుకున్నాడా లేక ఎవరైనా అతడ్ని బలవంతంగా తోసేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

Related News