లైవ్‌లో జర్నలిస్ట్‌కు కిస్

రష్యాలో జరుగుతున్న సాకర్ పోటీలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఐతే, ఈ పోటీలను కవర్ చేసేందుకు వెళ్లిన ఓ జర్నలిస్ట్‌కు ఊహించని, వింతైన అనుభవం ఎదురైంది. జర్మన్ న్యూస్ చానల్‌లో పని చేస్తున్న జూలియట్ గోంజాలెజ్ థెరాన్ అనే యువతి ఫుల్‌బాల్ మ్యాచ్‌లు జరుగుతున్న ప్రాంతంలో లైవ్ రిపోర్ట్ ఇస్తుండగా, గుర్తు తెలియని ఓ యువకుడు వచ్చి ఆమెకు కిస్ ఇచ్చాడు. ఐనా, ఆమె కంటిన్యూ లైవ్ చేశారు. జరిగిన ఘటనను సోషల్‌మీడియా ద్వారా షేర్ చేశారు జర్నలిస్ట్.

తాను లైవ్ రిపోర్ట్ ఇచ్చేందుకు అనుకున్న సమయం కంటే ముందుగానే ఆ ప్రాంతానికి వచ్చానని, లైవ్ చేస్తున్నప్పుడు వెంటనే రియాక్ట్ కాబోనని తెలుసుకున్న ఆ వ్యక్తి.. ఈ పని చేసి వెళ్లాడు, ఆపై యువకుడి కోసం వెతికినా కనిపించలేదని తెలిపారు. అతను స్థానికుడా? ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూసేందుకు వచ్చిన అభిమానా? అన్నది తెలియరాలేదు. ఓ మహిళా జర్నలిస్ట్‌కు రక్షణ కల్పించడంలో రష్యా విఫలమైందని ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి.

Related News