ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ?

కోయంబత్తూరులోని ఓ కళాశాలలో మాక్‌డ్రిల్ పేరిట లోకేశ్వరి అనే విద్యార్థినిని పొట్టనబెట్టుకున్న ట్రైనర్ ఆర్ముగం గురించి షాకింగ్ న్యూస్ ! అక్కడి కోవై కలై మగళ్  ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థులకోసం నేషనల్ డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ తనను ట్రైనర్‌గా పంపిందని చెప్పి ఆర్ముగం అనే ఈ వ్యక్తి ఈ కాలేజీకి వెళ్ళాడు. కాలేజీ యాజమాన్యంకూడా అతని మాటలు నమ్మి విద్యార్థులచేత మాక్‌డ్రిల్ చేయించింది. అయితే ఈ మాక్‌డ్రిల్‌కు, తమకు సంబంధం లేదని నేషనల్ డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ స్పష్టం చేసింది.

డ్రిల్ సమయంలో ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, ఆమె కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నామని పేర్కొన్న ఈ సంస్థ.. తాము అధికారికంగా ఈ డ్రిల్ నిర్వహించాలని ఏ వ్యక్తినీ పంపలేదని, పైగా ఆర్ముగం తాము గుర్తించిన ట్రైనర్ కాదని వెల్లడించింది. దీంతో షాక్ తినడం కళాశాల యాజమాన్యం వంతైంది. ఇదిలాఉండగా.. లోకేశ్వరి కుటుంబానికి తమిళనాడు సీఎం పళనిస్వామి రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు. అసలు ఆ వ్యక్తి ఎవరో.. ఆ కాలేజీలోకి ఎలా ప్రవేశించాడో..ఆరా తీయాలని మొత్తం ఘటన వివరాలు తెలియజేయాలని ఆదేశించారు.

 

Related News