భద్రకాళి ఫైర్ వర్క్స్ ఘటన..మృతుల కుటుంబాలకు సాయం

వరంగల్‌‌లోని భద్రకాళి ఫైర్‌వర్క్స్‌‌లో బాణాసంచా పేలి మరణించిన పదిమంది మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అందజేశారు. ఆ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ ఇళ్ళ పట్టాలను కూడా కడియం శ్రీహరి వారికి అందించారు. అలాగే బాణాసంచా పేలుడు కారణంగా సమీపంలో దెబ్బతిన్న ఇళ్ళ లోని పేదలకు కూడా ఈ పట్టాలను అందించారు. వరంగల్ ఛాంబర్ ఆఫ్‌ కామర్స్ తరఫున మృతుల ఫ్యామిలీలకు 20 వేల చొప్పున ఆర్ధిక సాయం సైతం అందింది.

READ ALSO

Related News