తోక జాడిస్తే చీటీ చిరిగినట్లే!

తెలంగాణాలో ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చేసింది. ఆపద్ధర్మ ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు కళ్లెం తొడుగుతూ.. ఎలక్షన్ కమిషన్ కొరడా ఝుళిపించింది. ఇప్పటికే రైతుబంధు చెక్కులపై ఆంక్షలొచ్చేశాయి. బతుకమ్మ చీరల పంపిణీ ఆగిపోయింది.. ఇలా ప్రతి పనికీ ఎన్నికల గండం పట్టేసుకుంది. ఇకపై ప్రభుత్వంతో పాటు పార్టీలు కూడా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తాఖీదులిచ్చారు. భారీ నగదు లావాదేవీలపై దృష్టి పెడతామని, ఇందుకోసం అవసరమైతే ఐటీ అధికారుల సహకారం తీసుకుంటామని హెచ్చరించారు. నామినేషన్లకు ఆఖరు తేదీ నవంబర్ 19కి 10 రోజుల ముందు వరకు ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తామని, ఓటర్ల జాబితాకు సంబంధించి హైకోర్టు ఎటువంటి ఆదేశాలిచ్చినా అమలు చేస్తామని చెప్పారు.

  • రాత్రి 10 నుంచి ఉదయం ఆరు వరకు ఎన్నికల ప్రచారంపై నిషేధం
  • ప్రతి జిల్లా కలెక్టరేట్ లో ఫిర్యాదు కోసం ప్రత్యేక విభాగం
  • అభివృద్ధి కార్యక్రమాల్ని 72 గంటల్లో నిలిపివేయాలి
  • కోడ్ ఉల్లంఘిస్తే తక్షణమే కఠిన చర్యలు తప్పవు
  • ఫ్లైయింగ్ స్క్వాడ్ , మొబైల్ టీం తో నిరంతర నిఘా
  • మీడియాలో ప్రభుత్వ అడ్వర్టయిజ్మెంట్స్ ప్రసారాలకు చెక్

Related News