తెలంగాణ అసెంబ్లీ.. ఫసక్!

రెండువారాలుగా తెలంగాణ రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీని రద్దు చేయాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ తీర్మానించింది. ఈ తీర్మానాన్ని రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌కు కేసీఆర్ అందజేశారు. దీనికి గవర్నర్ ఆమోదముద్ర వేయడం కూడా జరిగిపోయింది. కాగా అసెంబ్లీ రద్దుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్రం ఎన్నికల సంఘానికి, అసెంబ్లీ కార్యదర్శికి రాజ్‌భవన్ వర్గాలు పంపనున్నాయి. దీంతో ఎన్నికలపై తుది నిర్ణయాన్ని ఇక కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోనుంది. ఇప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు మాజీలుగా మారారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగనున్నారు.

Related News