ముందస్తు ఎన్నికల వెనుక అసలు కథ- డీకే అరుణ

ప్రభుత్వాన్ని నడపలేక టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లిందని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ. టీఆర్‌ఎస్‌ సర్కా రు సంక్షేమ పథకాలను పూర్తి చేయలేక ఎన్నికలను ఆశ్రయించిందని, వేల కోట్ల రూపాయల పనులు కాగితాలకే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అసలు అభివృద్ధి జరగలేదని, ప్రాజెక్టులను విపక్షాలు అడ్డుకుంటున్నాయన్న నెపంతోనే భూనిర్వాసితులకు పరిహారం చెల్లించలేదని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ నాయకులంతా దద్దమ్మలని, వాళ్లకి త్వరలో ప్రజలే బుద్ధి చెప్తారన్నారు డీకే అరుణ.

 

Related News