తండ్రి కాదు..రాక్షసుడు

హైదరాబాద్ జగద్గిరిగుట్టలో శివ‌గౌడ్ అనే ఆటో డ్రైవర్ తాగిన మత్తులో తన మూడేళ్ళ కొడుకు రిత్విక్‌ను ఓ ఆటోకేసి బాదాడు. ఈ ఘోరం పోలీసుల కళ్ళముందే జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. శివగౌడ్‌కి అదే ప్రాంతంలో ఉంటున్న మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆదివారం రాత్రి అతని భార్య వీరిని నిలదీసేందుకు వెళ్ళగా..అప్పటికే తాగిన మత్తులో ఉన్న శివగౌడ్ దుర్భాషలాడుతూ ఆమెపై దాడికి యత్నించాడు.

ఆమె ఎత్తుకున్న కొడుకును బలవంతంగా లాక్కుని అక్కడే పార్క్ చేసి ఉన్న ఆటోకు విసిరికొట్టాడు. ఇదంతా ఓ వీడియోకెక్కింది. ఇతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు విముఖత చూపడంతో వారే తమకు తాము శివ గౌడ్ పై కేసు నమోదు చేశారు. గాయపడిన చిన్నారిని మొదట చికిత్సకోసం నిలోఫర్ ఆసుపత్రికి, అనంతరం శిశు విహార్‌కు తరలించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలిసింది.

Related News